Virat Kohli: రోహిత్ శర్మ–విరాట్ కోహ్లీ వివాదంపై కేంద్ర మంత్రి స్పందన

  • ఆటకన్నా ఏ ఆటగాడూ ఎక్కువ కాదన్న అనురాగ్ ఠాకూర్
  • ఎవరి మధ్య ఏం జరుగుతుందో నేను చెప్పలేను
  • అది సంబంధిత క్రీడా సమాఖ్య, సంఘాల పని
No One Is Bigger Than The Game Anurag Thakur On Rohit and Kohli Dispute

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వివాదంపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఏ ఒక్క ఆటగాడూ ఆటకన్నా ఎక్కువేం కాదని తేల్చి చెప్పారు. ఆటలో పారదర్శకత ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘అందరికన్నా ఆటే ఎక్కువ. ఏ గేమ్ లో ఏయే ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుందన్నది నేను చెప్పలేను. ఆ సమాచారాన్ని నేనివ్వలేను. అది ఆయా క్రీడా సమాఖ్యలు, సంఘాల పని. వాళ్లే ఆ సమాచారం ఇస్తే బాగుంటుంది’’ అని అన్నారు.


కాగా, ఇటీవల వన్డే సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి క్రికెట్ లో వాతావరణం కాస్త వేడెక్కింది. గాయమంటూ టెస్టులకు రోహిత్ దూరమయ్యాడు. ఆ మర్నాడే కూతురు బర్త్ డే అంటూ కోహ్లీ కూడా వన్డేలకు అందుబాటులో ఉండనన్నాడంటూ ఓ అధికారి చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత కోహ్లీ అధికారికంగా ప్రకటించలేదు అని చెప్పకపోయినా.. అప్పటికే అజారుద్దీన్, కీర్తి ఆజాద్ లాంటి మాజీలు రోహిత్, కోహ్లీ మధ్య ఏదో జరుగుతోందన్న అంచనాకు వచ్చేశారు. అది క్రికెట్ కు ఎంత మాత్రమూ మంచిది కాదంటూ హితవు చెప్పే ప్రయత్నం చేశారు.

More Telugu News