Chiranjeevi: వెంకీ కుడుముల డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం

  • స్పీడ్ పెంచిన మెగాస్టార్
  • ఈ నెలలో 4 చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్న చిరు
  • తాజాగా 156వ చిత్రం ప్రకటన
  • ఛలో, భీష్మ చిత్రాలతో నిరూపించుకున్న వెంకీ
Megastar Chiranjeevi new movie under Venky Kudumula announced

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ నెలలో 4 చిత్రాల షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి తాజాగా 156వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండడం విశేషం. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై దీనిని దానయ్య నిర్మించనున్నారు. డాక్టర్ మాధవి రాజు ఈ చిత్రానికి సహ నిర్మాత.

'ఛలో' చిత్రంతో యూత్ ను విశేషంగా ఆకట్టుకున్న వెంకీ కుడుముల, ఆ తర్వాత 'భీష్మ'తో కమర్షియల్ సినిమాలు తీసే సత్తా ఉందని చాటుకున్నాడు. తాజాగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. త్వరలోనే తారాగణం వివరాలు ప్రకటించనున్నారు.

More Telugu News