Tollywood: టాలీవుడ్ కు పెద్ద ఊరట.. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గిస్తూ తీసుకొచ్చిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు!

AP high court suspends GO of AP Govt to reduce ticket rates
  • ప్రభుత్వ జీవోను హైకోర్టులో సవాల్ చేసిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు
  • సినిమా విడుదల సమయంలో రేటు పెంచుకునే హక్కు ఉందని కోర్టులో వాదన
  • పాత విధానంలోనే రేట్లు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించిన హైకోర్టు
తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట కలిగింది. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల సరికొత్త జీవో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి.

 ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ వాదనలను వినిపించారు. సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని వీరు కోర్టుకు తెలిపారు. టికెట్ ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు. వీరి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును పిటిషనర్లకు కల్పించింది.
Tollywood
Ticket Rate
AP High Court

More Telugu News