Tollywood: పోలీసు కేసు పెట్టిన యాంకర్ రవి!

Anchor Ravi Files Police Complaint
  • తన కుటుంబంపై అసభ్య కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదు
  • సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన యాంకర్
  •  ఇటీవల 'బిగ్ బాస్ 5' షోలో పోటీపడిన రవి  
యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించాడు. తనపైన, తన కుటుంబ సభ్యులపైనా కొందరు అసభ్య కామెంట్లు చేస్తున్నారని పేర్కొంటూ రవి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సోషల్ మీడియాలో తనపై అనుచిత కామెంట్లు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడని చెబుతున్నారు.  

కాగా, బిగ్ బాస్ 5లో రవి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, మధ్యలోనే అతడు ఎలిమినేట్ అయిపోయాడు. దీనిపై అతడి అభిమానులు మండిపడ్డారు. ఎలిమినేషన్ తర్వాత ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్పుకు వెళ్లాడు. ఇటీవలే తిరిగి వచ్చాడు. ఇప్పుడిలా పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.
Tollywood
Anchor Ravi
Police
TS Police

More Telugu News