Mayawati: ఆ పార్టీతో కలిసి పంజాబ్ లో ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వస్తాం: మాయావతి

  • శిరోమణి అకాలీదళ్ తో కలిసి పంజాబ్ లో విజయం సాధిస్తాం
  • కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం వల్ల బీజేపీకి ఉపయోగం ఉండదు
  • ఇతర పార్టీలు బహిష్కరించిన నేతలను ఎస్పీ చేర్చుకుంటోంది
Will win Punjab says Mayawati

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీతో కలిసి ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధీమా వ్యక్తం చేశారు. అకాలీదళ్ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశానికి కేవలం కొన్ని పార్టీలు మాత్రమే సుదీర్ఘకాలం పాటు సేవలందించాయని చెప్పారు. పంజాబ్ ప్రజల కోసం సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ప్రాంతీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ అని అన్నారు. సుఖ్ బీర్ సింగ్ బాదల్ నాయకత్వంలో తమ కూటమి పంజాబ్ లో ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.
 
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, సగం పూర్తయిన ప్రాజక్టులను ప్రారంభించడం వంటివి చేస్తున్నారని... ఇవి బీజేపీకి ఏమాత్రం లాభించవని మాయావతి అన్నారు. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును మోదీ ప్రారంభించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు సమాజ్ వాదీ పార్టీపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీలు బహిష్కరించిన నేతలను చేర్చుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని అన్నారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దిగ్విజయ్ నారాయణ్ చౌబే, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ, మాజీ ఎంపీ కౌశల్ అదివారం సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News