Telangana: తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • స్థానిక  సంస్థల కోటా కింద శుక్రవారం ఎన్నికలు
  • 12 స్థానాలకు ఆరు ఏకగ్రీవం
  • లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
MLC Elections Vote counting begins in telangana

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటా కింద మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, వీటిలో నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత మొదటి ప్రాధాన్యత ఓటుతో లెక్కింపు మొదలుపెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

 ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  కరీంనగర్‌లోని రెండు స్థానాలకు 9, ఆదిలాబాద్‌లో 6, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఐదేసి టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తున్నారు.

More Telugu News