Prabhas: ప్రభాస్ ఇంటి భోజనానికి దీపిక ఫిదా!

Prabhas home made food mesmerizes Deepika
  • ప్రభాస్ కొత్త చిత్రం ప్రాజెక్ట్-కె
  • హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పదుకొణే 
  • హైదరాబాదులో తాజా షెడ్యూల్
  • నగరానికి విచ్చేసిన దీపిక
  • అదిరిపోయే విందు ఏర్పాటు చేసిన ప్రభాస్

ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడంటే షూటింగ్ జరిగినన్నాళ్లు సెట్స్ లో నోరూరించే విందు భోజనాలు ఉండాల్సిందే. ఆయన తన సహనటుల కోసం ఇంటి నుంచి ఎంతో రుచికరమైన మాంసాహార వంటకాలు, రకరకాల బిర్యానీలు తెప్పిస్తుంటారు. గతంలో 'సాహో' చిత్రీకరణ సమయంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ముంబయి నుంచి హైదరాబాద్ రాగా... ఆమెకు పసందైన ఆంధ్రా వంటకాలతో ప్రభాస్ స్వాగతం పలికారు. ఆమె ప్రభాస్ ఆతిథ్యాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు.

తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్-కె చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే కథానాయిక. ఇటీవల ఓ షెడ్యూల్ కోసం దీపిక హైదరాబాదులో అడుగుపెట్టింది. సెట్స్ పైకి వచ్చిన దీపికకు ప్రభాస్ ఇంటి నుంచి ప్రత్యేకంగా వండించిన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను దీపిక సోషల్ మీడియాలో పంచుకుంది.

మామూలుగానే ప్రభాస్ ఇంట్లో చికెన్, మటన్, రొయ్యలు వంటి నాన్ వెజ్ ఘుమఘుమలు వస్తుంటాయి. ఇక అతిథుల కోసం అంటే చెప్పేదేముంది! ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజి వచ్చిందంటే సెట్స్ లో అందరి దృష్టి దానిపైనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

  • Loading...

More Telugu News