App: ఏపీలో ఆరోగ్యశ్రీ పథకంపై సులభ సమాచారం కోసం ప్రత్యేకంగా యాప్

  • ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • యాప్ తీసుకురావాలన్న సీఎం జగన్
  • ఎక్కడ చికిత్స చేయించుకోవాలో తెలిపే ఏర్పాట్లు ఉండాలని సూచన
  • రిఫరల్ విధానంపై దృష్టి సారించాలని అధికారులకు స్పష్టీకరణ
App for Arogyasri in AP

ఏపీ సీఎం జగన్ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు-నేడు పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు సులభమైన మార్గంలో సమాచారం అందేలా ఓ యాప్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఏ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయి? రోగులు ఏ ఆసుపత్రికి వెళ్లాలి? అనే అంశాలకు యాప్ ద్వారా సరైన మార్గదర్శనం చేయాలని నిర్దేశించారు. 108 ఆసుపత్రుల్లోనూ ఇలాంటి సమాచారం ఉండాలని, 104ను కూడా ఆ మేరకు అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.  

ఆరోగ్యశ్రీ పథకంలో 'రిఫరల్' అన్నది ఎంతో కీలమైనదని, యాప్ ద్వారా దాన్ని మరింత పరిపుష్టం, సరళతరం చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ రిఫరల్ విధానానికి విలేజ్ క్లినిక్ అనేది కేంద్రంగా మారాలని అభిలషించారు. ఈ యాప్ లో రోగుల సందేహాలను నివృత్తి చేసే సదుపాయం కూడా కల్పించాలని అధికారులకు తెలిపారు. రాష్ట్రంలోని ఆరోగ్య మిత్రలకు సెల్ ఫోన్లు ఇచ్చి, అందులో ఆరోగ్యశ్రీ యాప్ పొందుపరిచే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు.

  • Loading...

More Telugu News