Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం

  • ప్రముఖుల నుంచి కోట్ల రూపాయల వసూలు
  • ఎగవేతకు పాల్పడడంతో ఫిర్యాదులు 
  • శిల్పా చౌదరిని విచారిస్తున్న పోలీసులు
  • బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శిల్పా చౌదరి
Court denies bail to Shilpa Chowdary

పలువురి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఎగవేతకు పాల్పడిందన్న ఆరోపణలపై అరెస్టయిన శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. కిట్టీ పార్టీల పేరుతో ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని, వారికే టోకరా వేసిన శిల్పా చౌదరిని గత కొన్నిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు.

అయితే బెయిల్ కోరుతూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, ఆమెను రెండు రోజుల కస్టడీకి అప్పగించాలని నార్సింగి పోలీసులు పిటిషన్ వేశారు. గతంలో ఇచ్చిన మూడు రోజుల కస్టడీలో శని, ఆదివారాలు ఉండడంతో బ్యాంకు లావాదేవీల పరిశీలన సాధ్యం కాలేదని కోర్టుకు విన్నవించారు. అయితే ఒక్కరోజు మాత్రమే ఆమెను కస్టడీకి అప్పగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది.

మరోపక్క, న్యాయస్థానం శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపింది. అనంతరం శిల్పా చౌదరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో శిల్పా చౌదరి భర్తకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

More Telugu News