వెంకీ బర్త్ డే గిఫ్ట్ గా 'ఎఫ్ 3' నుంచి స్పెషల్ వీడియో!

13-12-2021 Mon 12:03
  • షూటింగు దశలో 'ఎఫ్ 3'
  • డబ్బు చుట్టూ తిరిగే కథ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • కీలక పాత్రలో అంజలి    
F3 movie update
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేశ్ ఒకరు. రామానాయుడు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన ఆయన, తన టాలెంట్ తోనే హీరోగా నిలదొక్కుకున్నారు. వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ తరం హీరోలతో పోటీపడుతూ ఆయన దూసుకుపోతుండటం విశేషం.

ఈ రోజున ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'ఎఫ్ 3' సినిమా టీమ్ ఒక పోస్టర్ తో పాటు సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. చార్మినార్ సెంటర్లో పరుపు వేసుకుని కరెన్సీ కాయితాలతో విసురుకుంటున్న సుల్తాన్ లుక్ తో వెంకటేశ్ కనిపిస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. వెంకటేశ్ కి రేచీకటి .. వరుణ్ తేజ్ కి నత్తి. ఈ రెండు అంశాల కారణంగా కావలసినంత కామెడీని గుమ్మరిస్తున్నట్టుగా  అనిల్ రావిపూడి చెప్పాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. అంజలి .. సంగీత ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు