Hardhik Pandya: హార్ధిక్ పాండ్యా గాయపడతాడని ముందే హెచ్చరించిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్

I warned Hardhik Pandya about injury says Shoib Akhtar
  • పాండ్యా, బుమ్రా వెన్ను కండరాలు బలంగా లేవన్న షోయబ్ అఖ్తర్
  • కండరాలు సన్నగా ఉన్నాయి, గాయపడతావని చెప్పానన్న అఖ్తర్
  • తాను చెప్పిన గంటన్నరకు పాండ్యా గాయపడ్డాడని వ్యాఖ్య
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. 2019 ప్రపంచకప్ తర్వాత పాండ్యా వెన్నెముక చికిత్స చేయించుకున్నాడు. గత కొంత కాలంగా పాండ్యా బౌలింగ్ చేయడం కూడా మానేశాడు. మరోవైపు పాండ్యా గురించి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ స్పందించాడు. గాయపడతావని పాండ్యాకు తాను ముందుగానే చెప్పానని అఖ్తర్ తెలిపాడు.
 
పాండ్యా, బుమ్రాలు చాలా సన్నగా ఉన్నారని... వారి వెన్ను కండరాలు బలంగా లేవని అఖ్తర్ చెప్పాడు. ఇదే విషయాన్ని పాండ్యా, బుమ్రాలకు చెప్పానని తెలిపాడు. తాను పాండ్యా వీపును తాకానని, కండరాలు చాలా సన్నగా ఉన్నాయని... నువ్వు గాయపడతావని పాండ్యాకు చెప్పానని... తాను చెప్పిన గంటన్నరకు పాండ్యా గాయపడ్డాడని చెప్పాడు. 2018 ఆసియా కప్ లో బౌలింగ్ చేస్తూ పాండ్యా తొలిసారి వెన్ను సమస్యకు గురయ్యాడు. ఫిట్ నెస్ సమస్య కారణంగా టీమిండియాకు పాండ్యా దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Hardhik Pandya
Shoib Akhtar
Team India
Pakistan

More Telugu News