Rajamouli: నా స్నేహితుడు సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లేకపోవడం బాధగా ఉంది: రాజమౌళి

Rajamouli attends Pushpa pre release event
  • హైదరాబాదులో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్
  • విచ్చేసిన రాజమౌళి
  • సినిమా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నట్టు వెల్లడి
  • చిత్ర బృందానికి శుభాకాంక్షలు
'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పుష్ప' దర్శకుడు, తన మిత్రుడు సుకుమార్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లేకపోవడం బాధగా ఉందన్నారు. 'పుష్ప'ను మరింత అద్భుతంగా చూపించేందుకు అవసరమైన పనుల కోసం సుకుమార్ ముంబయి వెళ్లారని రాజమౌళి వెల్లడించారు. సుకుమార్ దర్శకత్వం వహించే సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, తమ సినిమాల గురించి పరస్పరం సందేశాలు పంపుకుంటామని వివరించారు.

టైమ్ చాలట్లేదని ఇటీవల బాధపడ్డాడని, తాను అందుకు బదులిస్తూ, కష్టపడి పనిచేస్తే జరగాల్సింది జరుగుతుంది అని ప్రోత్సహించానని తెలిపారు. నిజంగానే సుకుమార్ డే అండ్ నైట్ పనిచేస్తున్నాడని కితాబిచ్చారు. పుష్ప ఒక అద్భుతం అనిపించే రీతిలో అలరించడం ఖాయమని రాజమౌళి కొనియాడారు.

కాగా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్ప చిత్రంలోని సమంత ఐటమ్ సాంగ్ 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' అనే పాటను కూడా ఆలపించారు. ఈ పాటను కన్నడంలో మంగ్లీ ఆలపించగా, తెలుగులో కొత్త గాయని ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. ఇంద్రావతి చౌహాన్ ఎవరో కాదు... మంగ్లీ చెల్లెలే. మంగ్లీ అసలు పేరు సత్యవతి చౌహాన్. ఆమె కుటుంబం నుంచి తాజగా ఇంద్రావతి కూడా సినీ నేపథ్య గాయనిగా ఎంట్రీ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంగ్లీ కన్నడంలో ఐటమ్ సాంగ్ పాడగా, ఇంద్రావతి చౌహాన్ తెలుగులో పాడింది.
Rajamouli
Pushpa
Pre Release Event
Sukumar
Allu Arjun
Tollywood

More Telugu News