Miroslaw Kuba Brozek: అల్లు అర్జున్ అంతరంగం కూడా ఎంతో అందమైనది: మిరోస్లా కూబా బ్రోజెక్

Pushpa cinematographer Miroslaw Kuba Brozek lauds Allu Arjun
  • హైదరాబాదులో 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 'పుష్ప' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన మిరోస్లా కూబా బ్రోజెక్
  • మిరోస్లా పోలెండ్ దేశస్థుడు
  • గతంలో 'గ్యాంగ్ లీడర్' చిత్రానికి పనిచేసిన వైనం
హైదరాబాదులో 'పుష్ప' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి 'పుష్ప' సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కూబా బ్రోజెక్ కూడా హాజరయ్యారు. పోలెండ్ దేశానికి చెందిన మిరోస్లా ఇంతకుముందు నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' చిత్రానికి కూడా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తాజా 'పుష్ప' చిత్రానికి కెమెరామన్ గా సేవలు అందించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, షూటింగ్ ఎంతో ఆహ్లాదకరంగా సాగిందని తెలిపారు. అల్లు అర్జున్ హృదయం కూడా ఎంతో అందమైనదని పేర్కొన్నారు. అల్లు అర్జున్ బాహ్య స్వరూపం మాత్రమే కాకుండా, అంతరంగం కూడా ఎంతో స్వచ్ఛమైనదని వివరించారు. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ గురించి ఇప్పుడే చెప్పలేనని, త్వరలో అందరూ చూస్తారని మిరోస్లా వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ కు, నటీనటులు రష్మిక మందన్న, సునీల్, అనసూయ, ఇతర టెక్నీషియన్లకు ఈ విదేశీ సినిమాటోగ్రాఫర్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Miroslaw Kuba Brozek
Allu Arjun
Pushpa
Cinematography
Pre Release Event

More Telugu News