Saiteja: స్వగ్రామంలో లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు పూర్తి

Lance Naik Saiteja funerals concludes in native village
  • తమిళనాడులో ఘోర హెలికాప్టర్ ప్రమాదం
  • సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల సహా 13 మంది మృతి
  • మృతుల్లో చిత్తూరు జిల్లా వాసి సాయితేజ
  • రావత్ పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న సాయితేజ
తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ కూడా మరణించడం తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తూ, ఆ ప్రమాదంలో సాయితేజ కూడా కన్నుమూశాడు.

కాగా, సైనికాధికారులు బెంగళూరు నుంచి సాయితేజ భౌతికకాయాన్ని నేడు స్వగ్రామం ఎగువరేగడకు తీసుకువచ్చారు. ఎగువరేగడలోని సొంత వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాల నడుమ సాయితేజ అంత్యక్రియలు నిర్వహించారు. సాయితేజ అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు. పొరుగు గ్రామాల ప్రజలు కూడా ఈ ఉదయం నుంచే ఎగువరేగడకు పోటెత్తారు. అంత్యక్రియల సందర్భంగా సాయితేజ అమర్ రహే నినాదాలతో వ్యవసాయక్షేత్రం పరిసరాలు మార్మోగిపోయాయి. ఆ దేశమాత ముద్దుబిడ్డకు అత్యంత ఘనంగా కడసారి వీడ్కోలు పలికారు.

అంతకుముందు సాయితేజ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యుల సందర్శన కోసం ఆయన నివాసం వద్ద ఉంచారు. ఆపై భారీ అంతిమయాత్రతో సాయితేజ భౌతికకాయాన్ని వ్యవసాయక్షేత్రానికి తరలించారు.
Saiteja
Funerals
Eguva Regada
Helicopter Crash
Chittoor District
Tamilnadu

More Telugu News