DCCI: ఇక బీసీసీఐ గొడుగు కిందకు దేశంలోని దివ్యాంగ క్రికెటర్లు... కొత్త కౌన్సిల్ ఏర్పాటు

  • భారత్ లో దివ్యాంగ క్రికెటర్ల కోసం డీసీసీఐ ఏర్పాటు
  • దివ్యాంగ క్రికెటర్ల కోసం కౌన్సిల్ ఏర్పాటు చేసిన బీసీసీఐ
  • దివ్యాంగ క్రికెటర్లకు మెరుగైన ప్రయోజనాలు
  • బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన డీసీసీఐ
BCCI announces new council for differently abled cricketers in India

భారత్ లో కొత్త క్రికెట్ కౌన్సిల్ ఏర్పాటైంది. దేశంలోని దివ్యాంగ క్రికెటర్ల కోసం బీసీసీఐ కొత్తగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీసీఐ)ని ఏర్పాటు చేసింది. ఇకపై దేశంలోని విభిన్న రకాల వైకల్యాలు కలిగిన క్రికెటర్లు కూడా బీసీసీఐ పరిధిలోకి వస్తారు.

గతంలో భారత మహిళా క్రికెట్ వ్యవస్థ కూడా విడిగా ఉండేది. కొంతకాలం కిందట భారత మహిళా క్రికెట్ బాధ్యతలను బీసీసీఐ స్వీకరించింది. అప్పటినుంచి దేశంలో మహిళా క్రికెటర్ల స్థితిగతులు గణనీయంగా మార్పు చెందాయి. గతంతో పోల్చితే భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ పరిధిలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా కొంత భరోసా పొందగలిగారు. ఇప్పుడు దివ్యాంగ క్రికెటర్ల వ్యవస్థ కూడా బీసీసీఐ ఏలుబడిలోకి వచ్చింది. దాంతో దేశంలోని దివ్యాంగ క్రికెటర్లకు మంచిరోజులు వచ్చినట్టే భావించాలి.

దీనిపై కొత్తగా ఏర్పాటైన డీసీసీఐ స్పందిస్తూ.... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, బోర్డు కోశాధికారి అరుణ్ ఠాకూర్ లకు కృతజ్ఞతలు తెలిపింది.

More Telugu News