Samantha: నాగచైతన్యతో విడాకులపై మరోసారి స్పందించిన సమంత

I dont want to repeat it again and again Samantha On divorce
  • చెప్పాలనుకున్నదంతా చెప్పేశా
  • మళ్లీ మళ్లీ మాట్లాడనని కామెంట్
  • ఇప్పుడు నా దృష్టంతా తదుపరి ప్రాజెక్టులపైనే
  • 2022 అంతా మజాయే
నాగచైత్యన్యతో విడాకుల వ్యవహారంపై సమంత మరోసారి స్పందించింది. ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకకు హాజరైన ఆమె.. ‘ఈటైమ్స్’తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై స్పందించింది. విడాకుల విషయం గురించి చెప్పదలచుకున్నదంతా చెప్పేశానని స్పష్టం చేసింది. విడాకుల గురించి తనచుట్టూ ఎందరో ఎన్నో అనుకున్నారని, అప్పుడే దానిపై మాట్లాడాలని భావించి మాట్లాడేశానని తెలిపింది. కాబట్టి మళ్లీ మళ్లీ దాని గురించే మాట్లాడాలనుకోవట్లేదని ఆమె తేల్చి చెప్పింది.

ఇక నుంచి తాను తన పని మీదే దృష్టి పెడతానని పేర్కొంది. ఇప్పటిదాకా మంచి పాత్రలు చేశానని, భవిష్యత్ లోనూ చేస్తానని, దాని కోసం కష్టపడి పనిచేస్తానని తెలిపింది. తాను చేయబోయే భవిష్యత్ ప్రాజెక్టులన్నీ ఒకదానికొకటి వేరువేరని ఆమె వ్యాఖ్యానించింది. కాబట్టి 2022 అంతా మజాయేనని చెప్పుకొచ్చింది.

ఫ్యామిలీ మ్యాన్ 2లోని బోల్డ్ సీన్స్ పైనా ఆమె మాట్లాడింది. సిరీస్ రిలీజ్ కాకముందు ఎన్నో అనుకున్నారని, కానీ, అది విడుదలయ్యాక అందరికీ తెలిసొచ్చిందని చెప్పింది. స్వేచ్ఛా జీవిగా ఉండే పాత్ర అని తెలిపింది. ఇటీవలి కాలంలో హీరోయిన్లకు అలాంటి పాత్రలు వస్తున్నది చాలా అరుదని పేర్కొంది.  
Samantha
Tollywood
Bollywood
Divorce

More Telugu News