Sai Teja: మరికాసేపట్లో లాన్స్ నాయక్ సాయితేజకు అంత్యక్రియలు

Sai Teja last rites to be held today in Eguvaregada
  • నిన్న మధ్యాహ్నం బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌కు సాయితేజ భౌతిక కాయం
  • సైనిక లాంఛనాల అనంతరం కమాండ్ ఆసుపత్రికి
  • ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు
హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్‌ సహా అసువులు బాసిన చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజకు నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాయితేజ సహా ఇతరుల భౌతిక కాయాలను గుర్తించిన సైనికాధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

ఇందులో భాగంగా సాయితేజ భౌతిక కాయం నిన్న మధ్యాహ్నం బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. అక్కడ సైనిక లాంఛనాలు నిర్వహించిన అనంతరం కమాండ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం 9 గంటలకు సాయితేజ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు.
Sai Teja
Lance Naik
Chittoor District
Eguvaregada
Bipin Rawat

More Telugu News