Jagan: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్

ysjagan  has announced   50 lac exgratia to the family of Lance Naik
  • హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సాయితేజ మృతి
  • డీఎన్ఏ ప‌రీక్ష ద్వారా మృతదేహం గుర్తింపు 
  • నేడు చిత్తూరుకు మృత‌దేహం
త‌మిళ‌నాడులో జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ స‌హా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. వారిలో చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. డీఎన్ఏ ప‌రీక్ష ద్వారా ఆయ‌న‌ మృతదేహాన్ని ఇప్ప‌టికే అధికారులు గుర్తించారు. ఆయ‌న మృత‌దేహాన్ని కాసేప‌ట్లో చిత్తూరుకు త‌ర‌లించ‌నున్నారు.  

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్.. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయి తేజ కుటుంబానికి 50 లక్షల రూపాయ‌ల‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్ ను త్వ‌రలోనే సాయితేజ కుటుంబానికి అందిస్తారు.
Jagan
Andhra Pradesh
Bipin Rawat

More Telugu News