'గని' రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా!

11-12-2021 Sat 10:14
  • వరుణ్ తేజ్ హీరోగా 'గని'
  • బాక్సింగ్ నేపథ్యంలోని కథ
  • తెలుగు తెరకి సయీ మంజ్రేకర్ పరిచయం
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు  
Ghani movie update
వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'గని' సినిమా రూపొందింది. సిద్ధూ ముద్దా .. అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమాతో, దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి పరిచయమవుతున్నాడు. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ, బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాతో కథానాయికగా సయీ మంజ్రేకర్ తెలుగుతెరకు పరిచయమవుతోంది.

ఈ సినిమాను ఈ నెల 3వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఆ తరువాత ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. అప్పటికే అక్కడ 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రిలీజ్ కి ఉంది. అదే రోజున 'గని' రంగంలోకి దిగితే నాని సినిమా వాయిదా పడుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ 'గని' సినిమానే వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలో చెబుతామని చెప్పారు. దాంతో వాయిదా వేయడానికి గల కారణాలను గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో జగపతిబాబు నటించగా, సునీల్ శెట్టి .. ఉపేంద్ర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.