Omicron: మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్ కేసుల నమోదు

Seven more Omicron cases registered in Maharashtra
  • కొత్త వేరియంట్ కలకలం
  • దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
  • తాజాగా ముంబయిలో 3, పింప్రి చించివాడ్ లో 4 కేసులు
  • మహారాష్ట్రలో 17కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 కేసులు ముంబయిలోనూ, 4 కేసులు పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ వెలుగు చూశాయి. కొత్త కేసులతో కలిపి మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 17కి చేరింది.

కాగా, ముంబయిలో నేడు ఒమిక్రాన్ నిర్ధారణ అయిన ముగ్గురూ పురుషులే కాగా, వారు టాంజానియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు గుర్తించారు. పింప్రి చించివాడ్ లో ఒమిక్రాన్ పాజిటివ్ నైజీరియా మహిళను కలిసిన నలుగురు ఒమిక్రాన్ బారినపడినట్టు వెల్లడైంది.

  • Loading...

More Telugu News