Shirisha: వినోదరంగంలోకి శ్రీదేవి మేనకోడలు... మ్యూజిక్ వీడియో ఇదిగో!

  • యూట్యూబ్ లో 'యదలో మౌనం' మ్యూజిక్ వీడియో
  • శిరీష, దర్శన్ జోడీగా వీడియో
  • శిరీష్... శ్రీదేవి మేనకోడలు
  • దర్శన్... శివాజీ గణేశన్ మనవడు
  • మ్యూజిక్ వీడియోకి లక్ష్మీదేవి దర్శకత్వం
Sridevi niece Shirisha featured in a music video

అటు అందచందాలు, ఇటు అభినయం... కలగలిసిన అపూర్వ నటీమణి శ్రీదేవి. ఇప్పుడామె కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద ప్రపంచంలో అడుగుపెడుతోంది. శ్రీదేవి మేనకోడలు శిరీష ఓ మ్యూజిక్ వీడియోలో కనువిందు చేసింది. సీనియర్ నటి పద్మిని మనవరాలు లక్ష్మీదేవి ఈ మ్యూజిక్ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో శిరీషకు జోడీగా నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు దర్శన్ నటించడం విశేషం. ఓ సెలబ్రిటీ ప్యాకేజి అనదగ్గ ఈ మ్యూజిక్ వీడియో పేరు 'యదలో మౌనం'. అచ్చు రాజమణి, వరుణ్ మీనన్ ఈ మ్యూజిక్ వీడియోకి సంగీతం సమకూర్చారు. టాలీవుడ్ యువ గీత రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించాడు.

More Telugu News