Pavan kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 12న పవన్ కల్యాణ్ దీక్ష

  • ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మికుల ఉద్యమం
  • మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్
  • గతంలోనే కేంద్రానికి లేఖ
Pavan kalyan

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు గత 300 రోజులకు పైబడి ఉద్యమిస్తుండడం తెలిసిందే. కార్మికుల పోరాటానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఈ నెల 12న దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు కార్మికులు సాగిస్తున్న పోరాటానికి పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటిస్తున్నారని వెల్లడించింది. ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షలో పవన్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పవన్ కల్యాణ్ గతంలో కేంద్రానికి లేఖ ఇవ్వడం తెలిసిందే. కార్మికులకు మద్దతుగా బహిరంగ సభలోనూ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News