Raviteja: 'ఖిలాడి' రిలీజ్ ఆలస్యం కానుందా?

Khiladi movie update
  • రవితేజ హీరోగా రానున్న 'ఖిలాడి'
  • ముందుగా చెప్పిన డేట్ ఫిబ్రవరి 11
  • అప్పటికి రాకపోవచ్చనే ప్రచారం 
  • విదేశీ షెడ్యూల్ పెండింగ్ అంటూ టాక్    
రవితేజ హీరోగా రమేశ్ వర్మ 'ఖిలాడి' సినిమాను రూపొందిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో, రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అలరించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ నుంచే అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది. రవితేజ తనదైన జోష్ తోనే కనిపిస్తున్నాడు.

ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. రవితేజ కూడా ఆ తరువాత సినిమాలకి సంబంధించిన షూటింగ్స్ లో బిజీ అయ్యాడు. దాంతో ఈ సినిమా షూటింగు పూర్తయిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగు ఇంకాస్త మిగిలే ఉండనే టాక్ వినిపిస్తోంది.

విదేశాల్లో చేయవలసిన ఒక షెడ్యూల్ పెండింగ్ లో ఉందని అంటున్నారు. ఇక్కడ సెట్ వేసో .. గ్రీన్ మ్యాట్ వేసో చేసేవి కాదట అవి. ఇప్పుడు విదేశాల్లో షూటింగు చేసే పరిస్థితి లేదు. అందువలన ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Raviteja
Meenakshi Choudary
Dimple Hayathi
Khiladi Movie

More Telugu News