Balakrishna: బాలకృష్ణతో మరో సినిమాను ప్లాన్ చేసిన బోయపాటి!

Boyapati upcoming movies
  • బోయపాటి నుంచి వచ్చిన 'అఖండ'
  • బాలయ్యతో మూడో సినిమా
  • ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు
  • మరో సినిమా ఉంటుందనే హింట్ ఇచ్చిన బోయపాటి
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారీ వసూళ్లతో కొత్త రికార్డులు రాసేస్తోంది. బోయపాటి రొటీన్ కి భిన్నంగా మాస్ యాక్షన్ కి ఆధ్యాత్మికతను జోడించడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. కొత్తగా ఆయన టచ్ చేసిన ఈ పాయింట్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ను నిన్న వైజాగ్ లో నిర్వహించారు. ఈ స్టేజ్ పై బోయపాటి మాట్లాడుతూ, తనకీ బాలకృష్ణగారికి మధ్య అవగాహన .. అనుబంధం ఏర్పడ్డాయని చెప్పారు. ఆయనతో ఒక సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలని చాలామంది అనుకుంటారు. అలాంటి ఆయనతో మూడు సినిమాలు చేసే భాగ్యం తనకి లభించిందని అన్నారు.

'మరో సినిమా ఉంటుందా?' అనే ప్రశ్న జనంలో నుంచి రావడంతో, అందుకు బోయపాటి స్పందిస్తూ .. "తప్పకుండా ఉంటుంది. అది ఎప్పుడు అనేది నేనే ఓపెన్ చేస్తాను .. అంతవరకూ వదిలేయండి" అని అన్నారు. మొత్తానికి కొంత గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఉండనుందనే విషయం మాత్రం అర్థమైపోతూనే ఉంది.
Balakrishna
Pragya jaiswal
Stikanth
Akhanda Movie

More Telugu News