కనులపండువగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం.. తరలివచ్చిన ప్రముఖులు.. ఫొటోలు ఇవిగో!

10-12-2021 Fri 08:45
  • వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్ కుమార్తె నిహారిక
  • హైదరాబాద్‌కు చెందిన రవితేజతో వివాహం
  • శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో వివాహం
 Vice President M Venkaiah NaiduGrand Daughters marriage
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో కనుల పండువగా జరిగింది. వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక-హైదరాబాద్‌కు చెందిన రవితేజను వివాహం చేసుకున్నారు.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. అలాగే, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటులు చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.