Tejashwi Yadav: బాల్య స్నేహితురాలిని పెళ్లాడిన తేజస్వీ యాదవ్.. ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు

Tejashwi Yadav ties the knot with childhood friend in Delhi
  • తేజస్వీ యాదవ్‌కు నిశ్చితార్థం జరగనున్నట్టు తొలుత వార్తలు
  • రాత్రికి రాత్రే నిశ్చితార్థం తంతు పూర్తి
  • ఢిల్లీలో అంగరంగ వైభవంగా వివాహం
  • యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సహా పలువురు ప్రముఖుల హాజరు

ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ వివాహం అట్టహాసంగా జరిగింది. నిజానికి నిశ్చితార్థం జరగనున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆ తంతును రాత్రికి రాత్రే పూర్తి చేసి నిన్న వివాహం కూడా జరిపించారు. 32 ఏళ్ల తేజస్వీ యాదవ్ ఢిల్లీకి చెందిన చిన్ననాటి స్నేహితురాలు రేచల్ (రాజేశ్వరీ యాదవ్)ను పెళ్లాడారు.

ఢిల్లీలో జరిగిన ఈ వివాహానికి యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ దంపతులు, రాజ్యసభ సభ్యురాలు, సోదరి మీసాభారతి సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను తేజస్వీ యాదవ్ సోదరి రోహిణి ఆచార్య ట్విట్టర్‌లో షేర్ చేశారు. పెళ్లి సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News