Modi: రావత్ సహా అమర జవాన్ల భౌతికకాయాలకు ఘన నివాళులు అర్పించిన మోదీ

PM Modi pays tributes to Gen Bipin Rawat
  • ఢిల్లీ పాలెం విమానాశ్రయంలో అమర జవాన్లకు మోదీ నివాళులు 
  • హాజరైన రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల చీఫ్ లు
  • రేపు సాయంత్రం 4 గంటలకు రావత్ దంపతుల అంత్యక్రియలు
తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో వీరి భౌతిక కాయాలకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు.  

అంతకుముందు అమర జవాన్ల భౌతికకాయాలను తమిళనాడు నుంచి సీ130-జే సూపర్ హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఢిల్లీకి తరలించారు. జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి భౌతికకాయాలను ఢిల్లీలోని వారి నివాసం వద్ద రేపు ఉదయం 11 గంటల నుంచి సందర్శకుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్కేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తారు.
Modi
bjp
Bipin Rawat
Tributes

More Telugu News