KCR: దేశం గర్వించేలా సచివాలయాన్ని నిర్మించాలి: కేసీఆర్

  • సచివాలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న కేసీఆర్
  • నిర్మాణం జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం
  • ఇతర రాష్ట్రాల సచివాలయాల్లోని మంచి అంశాలను స్వీకరించాలని సూచన
KCR visited newly constructing Secretariat

నూతన సచివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సెక్రటేరియట్ నిర్మాణ పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఈ సందర్భంగా సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు.

నిర్మాణంలో ఉన్న మంత్రులు, సెక్రటరీలు, వీఐపీల ఛాంబర్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలిస్తూ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. కారిడార్లు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్ సహా ప్రాంగణమంతా కలియతిరిగారు. ఎలివేషన్ తదితర ఫైనల్ వర్కుల కోసం సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంబంధిత అధికారులను అభినందించారు.

ఉద్యోగులు ప్రశాంతంగా పని చేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మాణం జరుగుతోందని సీఎం సంతోషాన్ని వ్యక్తం చేశారు. సచివాలయాన్ని దేశం గర్వించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని సచివాలయాలను పరిశీలించి వాటిలోని మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు.

  • Loading...

More Telugu News