'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేటు .. ప్లేసు ఫిక్స్!

09-12-2021 Thu 18:45
  • అంచనాలు పెంచుతున్న 'పుష్ప'
  • ప్రతి పాత్రకి ప్రత్యేకమైన లుక్ 
  • ఈ నెల 12న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 17వ తేదీన సినిమా విడుదల    
Pushpa Pre Release Event Date Confirmed
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేటు .. టైము ఫిక్స్ చేశారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాదు .. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎవరు రానున్నారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చాడు. ఆయన నుంచి వచ్చిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కథాకథనాల పరంగా ఈ సినిమా నిరూపించుకోవలసి ఉంది. డాన్సులు .. ఫైట్లు హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.

రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. ఫాహద్ ఫాజిల్ .. సునీల్ .. అనసూయ .. అజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సుకుమార్ ప్రతి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయడం వలన, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా సంచలనానికి తెరదీస్తుందేమో చూడాలి.