'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ కోసం ముంబై చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్  

09-12-2021 Thu 18:08
  • ఉదయం ట్రైలర్ విడుదల
  • దేశంలోని పెద్ద స్టార్లతో కలిసి పని చేయాలని ఉందన్న తారక్
  • హైదరాబాద్ తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నైలలో ప్రెస్ మీట్ లకు ప్లాన్
Junior NTR reaches Mumbai
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు అలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులు కూడా నటించారు.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, జనవరి 7న ఈ చిత్రం విడుదలవుతోందని... హిందీ ఆడియన్స్, విమర్శకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. మన దేశంలోని పెద్ద స్టార్లతో కలిసి పని చేయాలనేది తన కోరిక అని అన్నారు. కరోనా వల్ల భారతీయ సినిమా కోల్పోయిన వైభవాన్ని ఈ చిత్రం మళ్లీ తీసుకొస్తుందని చెప్పారు.

మరోవైపు సినిమా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. హైదరాబాద్ తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నైలలో ప్రెస్ మీట్ లకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కాసేపటి క్రితం తారక్ ముంబైకి చేరుకున్నారు. ఆయనతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య ఉన్నారు. మిగిలిన టీమ్ కూడా అక్కడకు చేరుకోనున్నారు.