ఏపీలో కొత్తగా 193 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

09-12-2021 Thu 17:46
  • రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురి మృతి
  • కరోనా నుంచి కోలుకున్న 164 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,460
AP records 193 new corona cases
గత 24 గంటల్లో ఏపీలో 31,101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 164 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇక కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,74,410కి చేరుకుంది. మొత్తం 20,57,913 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,460 మంది మృతి చెందారు.