రానా సినిమా కూడా ఈ నెలలోనే .. రిలీజ్ డేట్ ఖరారు!

09-12-2021 Thu 17:46
  • రానా హీరోగా '1945'
  • కథానాయికగా రెజీనా
  • దర్శకుడిగా సత్యశివ  
  • ఈ నెల 31వ తేదీన విడుదల  
1945 movie release date confirmed
రానా కథానాయకుడిగా రూపొందిన 'విరాటపర్వం' ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే రావలసిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడింది. అప్పటి నుంచి కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక సాయిపల్లవి కావడం వాళ్లలో మరింత ఆసక్తిని పెంచుతోంది.

అయితే అంత కంటే ముందుగానే రానా చేసిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోయింది .. ఆ సినిమా పేరే '1945'. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. చాలాకాలం క్రితమే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగింది.

సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకి సత్యశివ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర రాజా సంగీతాన్ని సమకూర్చగా, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. ఈ సినిమాలో రానా స్వాత్రంత్య్ర సమరయోధుడిగా కనిపించనున్నాడు. రానా జోడీగా రెజీనా నటించగా, సత్యరాజ్ .. నాజర్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.