మోదీతో సుదీర్ఘమైన చర్చ జరిగింది: విజయసాయిరెడ్డి

09-12-2021 Thu 17:37
  • మోదీతో విజయసాయిరెడ్డి భేటీ
  • అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చారన్న విజయసాయి
  • పెండింగ్ సమస్యలపై లోతుగా చర్చించానన్న వైసీపీ ఎంపీ
Had a detailed discussion with Modi says Vijayasai Reddy
ప్రధాని మోదీతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలని అడిగిన వెంటనే మోదీ తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారని... చాలా సంతోషకరమని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన అనేక సమస్యలను చర్చించామని... ఈ విషయాలపై ప్రధానితో కూడా చర్చించానని తెలిపారు. అన్ని పెండింగ్ సమస్యలపై మోదీతో లోతుగా చర్చించానని చెప్పారు.