వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

09-12-2021 Thu 16:43
  • 157 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 47 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4.60 శాతం పెరిగిన ఐటీసీ షేర్ విలువ
Markets ends in profits
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్లు లాభపడి  58,807కి పెరిగింది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకుని 17,517 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (4.60%), ఎల్ అండ్ టీ (3.06%), ఏసియన్ పెయింట్స్ (2.23%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.59%), బజాజ్ ఫైనాన్స్ (1.03%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.67%), టైటాన్ కంపెనీ (-1.32%), నెస్లే ఇండియా (-0.99%), ఎన్టీపీసీ (-0.94%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.69%).