కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌పై గోనె ప్రకాశ్ వివాదాస్పద వ్యాఖ్యలు

09-12-2021 Thu 14:28
  • ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై గోనె ప్రకాశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
  • ఆమె ఛాంబర్లో అంతమంది ప్రజా ప్రతినిధులు ఎందుకున్నారని ప్రశ్న
  • రాష్ట్రంలో కేసీఆర్ పునాదులు కదులుతున్నాయని వ్యాఖ్య
Gone Prakash sensational comments on Adilabad Dist collector Sikta Patnaik
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్తా తన బయోడేటా గురించి ఓ జర్నలిస్టును అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు. ఆమె ఛాంబర్ లో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నలుగురు జెడ్పీ ఛైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ, 22 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని... అంత మంది అక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు.

తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం టీఆర్ఎస్ కు తగదని చెప్పారు. ప్రతి విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు పలికిందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పునాదులు కదులుతున్నాయని చెప్పారు.