పెళ్లికి రెడీ.. చీర‌క‌ట్టులో హీరోయిన్ క‌త్రినా కైఫ్‌ ఫొటో వైర‌ల్

09-12-2021 Thu 14:05
  • నేడు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి
  • రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ బర్వారా కోటలో వేడుక‌
  • చిరున‌వ్వులు చిందిస్తూ క‌త్రినా
katrina pic goes viral
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల పెళ్లి బాలీవుడ్ లో ఆస‌క్తి రేపుతోంది. కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించి ఎన్నో వార్త‌లు ప్ర‌చురితం అవుతున్నాయి. వ‌ధూవ‌రుల ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్  నేడు  పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.  

రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ బర్వారా కోటను ఇందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టికే పెళ్లి వేడుకలు ప్రారంభ‌మ‌య్యాయి. తాజాగా, పెళ్లి కూతురు క‌త్రినా కైఫ్ చీర‌క‌ట్టులో చిరున‌వ్వులు చిందిస్తూ ఫొటో దిగింది. పెళ్లి వేడుక‌కు బాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌లివ‌స్తున్నారు.