తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో... అన్న ఉద్యమ వీరుడి ప్రస్థానానికి నేటితో పన్నెండేండ్లు: కేటీఆర్

09-12-2021 Thu 12:23
  • 2009, డిసెంబరు 9ని గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ట్వీట్
  • 'ఒక దీక్ష... ఒక విజయం.. ఒక యాది' అన్న కేటీఆర్  
  • అల్లం నారాయ‌ణ క‌థ‌నాన్ని పోస్ట్ చేస్తూ కృతజ్ఞతలు
ktr on december 9
'ఒక దీక్ష... ఒక విజయం.. ఒక యాది...' అంటూ 2009, డిసెంబరు 9ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌త్యేక‌ తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేస్తోన్న స‌మ‌యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం  తెలంగాణ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభించామని ఆ ప్రకటనలో తెలిపారు. డిసెంబ‌రు 9 ప్ర‌క‌ట‌న‌గా దీన్ని పిలుచుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు.

'తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో... అన్న ఉద్యమ వీరుడి ప్రస్థానానికి నేటితో పన్నెండేండ్లు.. జై కేసీఆర్..  జై తెలంగాణ' అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ అల్లం నారాయ‌ణ ఈ సంద‌ర్భంగా రాసిన ఓ క‌థ‌నాన్ని కేటీఆర్ పోస్ట్ చేస్తూ ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.