ఉత్కంఠను రేపుతున్న 'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ ఇదిగో!

09-12-2021 Thu 11:40
  • రాజమౌళి నుంచి 'ఆర్ ఆర్ ఆర్' 
  • పవర్ఫుల్ పాత్రలలో ఎన్టీఆర్, చరణ్ 
  • అంచనాలు పెంచుతున్న అప్ డేట్స్ 
  • జనవరి 7వ తేదీన విడుదల
RRR Trailer Released
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం అందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో ముడిపడిన ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించారు. రీసెంట్ గా విడుదలైన వారి పోస్టర్స్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయి.

ఈ నేపథ్యంలో  తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆంగ్లేయుల అరాచకాలు .. అడవి ప్రజల పట్ల వాళ్ల అమానుష చర్యలు .. వాళ్లని ప్రశ్నించే వీరుడిగా కొమరం భీమ్ కనిపిస్తున్నాడు. ఆంగ్లేయుల తరఫున పోలీస్ అధికారిగా .. కొమరం భీమ్ తరఫున పోరాడే వీరుడిగా రెండు విభిన్నమైన గెటప్పులలో చరణ్ కనిపిస్తుండటం విశేషం.

'తొక్కుకుంటూ పోవాలే .. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే' అంటూ ఎన్టీఆర్ ఆవేశంతో చెప్పిన డైలాగ్, 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి' అంటూ అజయ్ దేవగణ్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. లవ్  .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ ట్రైలర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.