ద‌క్షిణాఫ్రికాలో భార‌త్‌ ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదు.. ఇప్పుడు మంచి ఛాన్స్: హ‌ర్భ‌జ‌న్‌

09-12-2021 Thu 11:23
  • ఈ నెల 26 నుంచి టెస్టు సిరీస్
  • అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  • ద‌క్షిణాఫ్రికా జట్టులో ఆటగాళ్లెవరూ ఫామ్‌లో లేరు
  • విజయం సాధించి చరిత్ర సృష్టించాలి
harbhajan on south africa test series
టీమిండియా-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య ఈ నెల 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌పై టీమిండియా మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ త‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ఈ పర్యటనలో గెలిచేందుకు టీమిండియాకు మంచి అవకాశం ఉందని చెప్పారు.

ద‌క్షిణాఫ్రికాలో టీమిండియా ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదని ఆయ‌న తెలిపారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టెస్టుల్లో మాత్రం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయ‌న అన్నారు. ప్రస్తుతం ద‌క్షిణాఫ్రికా జట్టులో ఆటగాళ్లెవరూ ఫామ్‌లో లేరని చెప్పారు. దీంతో ఆ దేశంలో ఈ సారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఆయ‌న అన్నారు.

దక్షిణాఫ్రికా జట్టు గ‌తంలో బాగా ఆడేద‌ని, ఇప్పుడు బ‌లంగా లేద‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ చెప్పారు. గత పర్యటనలో ఏబీ డివిలియర్స్, ఫాడుప్లెసిస్‌ లాంటి ఆటగాళ్లు భార‌త్‌ సిరీస్‌ గెలవకుండా అడ్డుకోగ‌లిగార‌ని తెలిపారు. భారత్ ఎంత బాగా ఆడిన‌ప్ప‌టికీ ఎన్న‌డూ సిరీస్‌ నెగ్గలేదని ఆయ‌న చెప్పారు.