వైజాగ్ లో 'అఖండ' గ్రాండ్ సక్సెస్ ఈవెంట్!

09-12-2021 Thu 10:44
  • భారీ విజయాన్ని అందుకున్న 'అఖండ'
  • బాలకృష్ణ .. బోయపాటిలకు హ్యాట్రిక్ హిట్
  • ఈ సాయంత్రం గ్రాండ్ సక్సెస్ ఈవెంట్
  • వేదికగా వైజాగ్ ఎమ్ జీ ఎమ్ గ్రౌండ్స్  
Akhanda Grand Success Event on 10th December
మొత్తానికి అభిమానులు ఆశించినట్టుగానే బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. 'సింహా' .. ' లెజెండ్'కి మించి ఈ సినిమాకి ఆదరణ లభిస్తుండటం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ సినిమా 100 కోట్ల మార్క్ దిశగా దూసుకెళుతుండటం విశేషం.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో ప్లాన్ చేశారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని, ఈ వేడుకను హైదరాబాదులోనే నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంతో, వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

వైజాగ్ లోని 'ఎమ్ జీ ఎమ్ గ్రౌండ్స్' లో ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఉడా పార్క్ పక్కనే ఉన్న ఈ గ్రౌండ్ వేలాదిమంది అభిమానులు తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉంటుందట. అందువల్లనే ఈ సక్సెస్ ఈవెంట్ ను అక్కడ నిర్వహిస్తున్నారు..