దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

09-12-2021 Thu 10:14
  • 24 గంటల్లో 9,419 కరోనా కేసులు
  • నిన్న‌ 159 మంది మృతి
  • మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,74,111
  • 130.39 కోట్ల డోసుల వ్యాక్సిన్ల వినియోగం
corona bulletin in inida
దేశంలో కొత్త‌గా 9,419 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న 8,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. క‌రోనాతో నిన్న‌ 159 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 94,742 మంది క‌రోనాకు హోం క్వారంటైన్, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,40,97,388 మంది కోలుకున్నారు. మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,74,111కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 130.39 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.