బాలకృష్ణ .. అనిల్ రావిపూడి కాంబోలో మెహ్రీన్!

09-12-2021 Thu 10:13
  • 'ఎఫ్ 2'లో మెరిసిన మెహ్రీన్
  • పేరు తెచ్చిపెట్టిన 'హనీ' పాత్ర  
  • ప్రస్తుతం 'ఎఫ్ 3' షూటింగులో బిజీ
  • మరో ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి
Mehrin in Anil Ravipudi movie
టాలీవుడ్ తెరకి పరిచయమైన గ్లామరస్ హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆమెకి ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టిన సినిమాలు 'మహానుభావుడు' .. 'ఎఫ్ 2' సినిమాలనే చెప్పాలి. 'ఎఫ్ 2' సినిమాలో 'హనీ ఈజ్ ద బెస్ట్' అంటూ తెరపై ఆమె చేసిన అందమైన అల్లరిని ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆమె కెరియర్లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రూపొందుతోంది. ఈ సినిమాలో కూడా 'హనీ' పాత్రలోనే మెహ్రీన్ సందడి చేయనుంది. ఇక అనిల్ రావిపూడి ఆ తరువాత తాను చేయనున్న సినిమాలో కూడా ఆమెనే కథానాయికగా ఎంపిక చేసుకున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను బాలకృష్ణతో చేయనున్నాడు. 'ఎఫ్ 3' తరువాత ఆయన ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ లోగా బాలకృష్ణ .. గోపీచంద్ మలినేని ప్రాజెక్టును పూర్తిచేస్తారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ కనువిందు చేయనుండగా, అనిల్ రావిపూడి సినిమాలో మెహ్రీన్ అందాల సందడి చేయనుందన్న మాట.