'పుష్ప'లో సమంత ఐటం సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారు

08-12-2021 Wed 22:06
  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప'
  • ఐటం నంబర్ చేసిన సమంత
  • సమంత పాటపై సర్వత్రా ఆసక్తి
  • ఈ నెల 10న రిలీజ్ చేయనున్న చిత్రబృందం
Samantha starred item song from Pushpa release date announced
ఇటీవల స్పీడు పెంచిన సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలే కాదు ఐటం సాంగ్ లకు కూడా ఓకే చెబుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప' చిత్రంలో సమంత ఓ ఐటం పాట చేసింది. ఇప్పటికే 'పుష్ప' చిత్రం నుంచి వచ్చిన పాటలు విశేషాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి సమంత పాటపైనే ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు 'పుష్ప' చిత్రయూనిట్ తియ్యని కబురు చెప్పింది.

ఈ నెల 10న సమంత నటించిన ఐటం సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సమంత పిక్ ను కూడా పంచుకుంది. 'పుష్ప' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజైన 'పుష్ప' ట్రైలర్ 20 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం డిసెంబరు 17న రిలీజ్ కానుంది.