ఓ యువతి పెళ్లి జరుగుతుండగా ప్రియుడి ఎంట్రీ... నుదుటన సింధూరం దిద్ది పారిపోయిన వైనం

08-12-2021 Wed 21:55
  • ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఘటన
  • దండలు మార్చుకునేందుకు సిద్ధమైన వధూవరులు
  • అమ్మాయి ప్రియుడి రాక
  • పెళ్లిమంటపంలో కలకలం
  • వీడియో వైరల్
Uttar Pradesh youth enters into wedding ritual
ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గోరఖ్ పూర్ లో ఓ యువతి పెళ్లి జరుగుతుండగా ఆమె ప్రియుడు మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వైనం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వధూవరులు దండలు మార్చుకునేందుకు సిద్ధమవుతుండగా, ఇంతలో అమ్మాయి ప్రియుడు పెళ్లిమంటపం వద్దకు వచ్చాడు.

అందరూ చూస్తుండగా, నేరుగా వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న సింధూరాన్ని అమ్మాయి నుదుటన దిద్దాడు. అందుకు ఆ అమ్మాయి ప్రతిఘటించింది. ఇంతలో అతడిని పట్టుకునేందుకు అక్కడివారు ప్రయత్నించారు. అయితే ఆ యువకుడు అక్కడ్నించి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.