Prabhas: 'రాధే శ్యామ్' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!

  • ప్రభాస్ తాజా చిత్రంగా 'రాధే శ్యామ్'
  • విదేశీ నేపథ్యంలో సాగే ప్రేమకథ
  • హిందీ వెర్షన్ నుంచి పాట రిలీజ్
  • జనవరి 14వ తేదీన సినిమా విడుదల  
Radhe Shyam movie update

ప్రభాస్ - పూజ హెగ్డే కాంబినేషన్లో 'రాధే శ్యామ్' సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ - టి సిరీస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

మొదటి నుంచి కూడా హిందీ వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్స్ ను ప్రత్యేకంగా చేస్తున్నారు. అలా తాజాగా ఈ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ మెలోడీని రిలీజ్ చేశారు. 'సోచ్ లియా .. ' అంటూ సాగే ఈ పాటను, ఫారిన్ లొకేషన్స్ లో ప్రభాస్ .. పూజ హెగ్డేలపై చిత్రీకరించారు. అనుభవాలు .. అనుభూతులు .. జ్ఞాపకాలు అన్నట్టుగా కాస్త ఎమోషనల్ టచ్ తో ఈ పాట సాగింది.

1970ల నాటి కాలానికి సంబంధించిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆవిష్కరించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మిథున్ స్వరపరిచిన ఈ పాటకి మనోజ్ సాహిత్యాన్ని అందించగా, ఆర్జిత్ సింగ్ ఆలపించాడు. పాట యూత్ మనసులను పట్టేసేదిలానే ఉంది. జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News