Bipin Rawat: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. హెలికాప్టర్ లో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్!

CDS Bipin Rawat boarded helicopter crashed
  • ఊటీ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్
  • చాపర్ లో రావత్ తో పాటు 14 మంది
  • బయల్దేరిన కాసేపటికే కూలిన చాపర్
తమిళనాడులోని ఊటీ సమీపంలో ఉన్న కూనూరు వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కుప్పకూలింది. ఈ హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్, మరో ముగ్గురు ఆర్మీ అధికారులు, రావత్ భార్య, కుటుంబ సభ్యులు ఉన్నారు. హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నట్టు సమాచారం. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే కూలిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి మిలిటరీ అధికారులు చేరుకున్నారు. అప్పటికే 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఇద్దరిని స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. లోయ ప్రాంతాల్లో కొందని శరీరాలు కనిపిస్తున్నాయి. వీరి శరీరాలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెలికాప్టర్ లో బిపిన్ రావత్ ఉన్న విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపింది.

Bipin Rawat
Army Helicopter
Crash

More Telugu News