ఇండియాలో కొత్తగా 8,439 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

08-12-2021 Wed 10:17
  • గత 24 గంటల్లో 195 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 93,733
  • ఇప్పటి వరకు వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 129.5 కోట్లు
India reports 8439 new COVID19 cases
భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 8,439 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 9,525 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా... 195 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,40,89,137 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 4,73,952 మంది మృతి చెందారు.

ఇక ఇప్పటివరకు 129.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ భయాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఒమిక్రాన్ రూపంలో దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.