అమిత్ షాతో భేటీ అయిన వైసీపీ ఎంపీలు!

08-12-2021 Wed 09:26
  • అమిత్ షాను కలిసిన విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి
  • కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వాలని విన్నపం
  • పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరిన వైనం
YSRCP Vijayasai Reddy and Muthun Reddy meets Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ నేత మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు పలు విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరించారు. ప్రభుత్వం తరపున ఒక నివేదికను అందించారు.

పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని... ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదముద్ర వేయాలని ఈ సందర్భంగా అమిత్ షాను ఎంపీలు కోరారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరించాలని విన్నవించారు. ఇటీవల సంభవించిన వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని... వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు.