సిరివెన్నెల నివాసానికి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

07-12-2021 Tue 21:19
  • కొన్నిరోజుల కిందట సిరివెన్నెల కన్నుమూత
  • కిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
  • తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు
  • పరామర్శించిన తమిళిసై
Telangana governor Tamilisai visits Sirivennela Sitharama Shastri family members
టాలీవుడ్ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్య సమస్యలతో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మృతి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇవాళ ఆమె హైదరాబాదులోని సిరివెన్నెల నివాసానికి వెళ్లారు. అక్కడ సిరివెన్నెల చిత్రపటానికి నివాళులు అర్పించారు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరివెన్నెల అర్ధాంగితో మాట్లాడి ఓదార్పు వచనాలు పలికారు. ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. అటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య కుటుంబ సభ్యులను కూడా గవర్నర్ తమిళిసై పరామర్శించారు.