Kishan Reddy: కేంద్రంపై పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు: టీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం

  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి
  • హుజూరాబాద్ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్య 
  • కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • కేంద్రం రైతులకు అన్యాయం చేయదని స్పష్టీకరణ
Kishan Reddy fires on TRS

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపును టీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని అన్నారు. కేంద్రంపై పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఇప్పుడు దాన్ని పెను సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఒప్పందం ప్రకారం రా రైస్, బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెబుతోందని, రైతులకు కేంద్రం అన్యాయం చేయదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ, కేంద్రంపై కేసీఆర్ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ తీరు చూస్తుంటే కిసాన్ బచావో అన్నట్టుగా లేదు, కేసీఆర్ బచావో అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని, రైతుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేసే చర్యలు వద్దని హితవు పలికారు.

More Telugu News